చిన్ననాటి స్నేహితురాలితో హార్దిక్ పటేల్ పెళ్లి.. తేదీని ప్రకటించిన కుటుంబ సభ్యులు!

21-01-2019 Mon 12:12
  • స్వగ్రామం దిగ్సార్ లో వివాహ వేడుక
  • నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయం
  • పటేళ్ల రిజర్వేషన్ కోసం హార్దిక్ పోరాటం
గుజరాత్ రాష్ట్రంలో పటేల్ సామాజికవర్గానికి రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్ వివాహబంధంలోకి అడుగపెట్టబోతున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు కింజల్ పారిఖ్ ను పెళ్లి చేసుకోనున్నారు. సురేంద్రనగర్ జిల్లాలోని హార్దిక్ స్వగ్రామం దిగ్సార్ లో ఈ నెల 27న హార్దిక్ వివాహం జరుగుతుందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.  కాగా, ఈ వేడుకను నిరాడంబరంగా జరుపుకోవాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయన్నారు.

సన్నిహితులైన దాదాపు 100 మందిని మాత్రమే ఈ వేడుకలకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరోవైపు పారిఖ్ కూడా పటేల్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయేనని హార్దిక్ సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆమె గాంధీనగర్ లో ఎల్ఎల్ బీ చదువుతోందని పేర్కొన్నారు. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి పేరుతో హార్దిక్ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్నారు.