kcr: 13 ఏళ్ల తర్వాత నేను, కేసీఆర్ మాట్లాడుకున్నాం: జగ్గారెడ్డి

  • సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ గురించి అడగ్గానే కేసీఆర్ సానుకూలంగా స్పందించారు
  • జీవో వెలువడిన తర్వాత కేసీఆర్ ను ఘనంగా సన్మానిస్తా
  • ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయం

దాదాపు 13 ఏళ్ల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తాను మాట్లాడుకున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తాను తొలిసారి ఎమ్మెల్యే అయింది టీఆర్ఎస్ నుంచేనని చెప్పారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉందని... అదే విషయంపై అసెంబ్లీలో తాను అడగ్గానే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని... ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.

కాలేజీ ఏర్పాటుపై జీవో వెలువడిన తర్వాత కేసీఆర్ ను కలుస్తానని... సంగారెడ్డికి ఆయనను ఆహ్వానించి ఘనంగా సన్మానిస్తానని తెలిపారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవలంబించిన విజన్ 2020 వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. మెదక్ నుంచి రాహుల్ గాంధీ, కేసీఆర్ లు తలపడితే... రాహుల్ బంపర్ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు.

More Telugu News