మెగా ఫ్యామిలీ కొత్త హీరో ఎంట్రీ రేపే!

- తెరంగేట్రం చేస్తున్న వైష్ణవ్ తేజ్
- మొదటి సినిమా లాంచ్ రేపే
- దర్శకత్వం వహిస్తున్న బుచ్చిబాబు
ఇతని మొదటి సినిమా రేపు లాంచ్ కాబోతోంది. ఈ కార్యక్రమానికి మెగా హీరోలు దాదాపుగా హాజరవుతారని చెబుతున్నారు. సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పని చేసిన బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.