తన తండ్రి ఎవరన్న ప్రశ్నకు సరదా జవాబు చెప్పిన సారా అలీఖాన్

- ‘కేదారనాథ్’ మంచి విజయం సాధించింది
- ‘సింబా’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది
- సారాకు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్
ఈ నేపథ్యంలో అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. తన కోసం గూగుల్లో అభిమానులు వివిధ ప్రశ్నలతో తెగ వెతుకుతున్నారు. వాటిలో కొన్నిటికి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సారా జవాబులిచ్చింది. ఇందులో భాగంగా ‘సారా తండ్రి ఎవరు?’ అని గూగుల్లో పలువురు వెతికిన ప్రశ్నకు ‘మహాత్మాగాంధీ’ అంటూ టక్కున సరదాగా తనదైన సహజ శైలిలో సమాధానమిచ్చింది. అనంతరం ఈ విషయంలో జోకులు వేయకూడదని.. క్షమించమని వేడుకుని ‘సైఫ్ అలీఖాన్’ అని చెప్పి, 'మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్' అంటూ సర్దిచేప్పింది.