వైయస్ తెచ్చిన ఆరోగ్యశ్రీ చాలా గొప్ప పథకం.. మంచి పథకాలను మెచ్చుకోవాల్సిందే: కేసీఆర్

- ఇదే విషయాన్ని మోదీకి కూడా చెప్పా
- గొప్ప పథకాన్ని అభినందించడానికి నాకు భేషజాలు లేవు
- ఆయుష్మాన్ భారత్ మాకు వద్దని మోదీకి తెలిపాను
ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం చాలా బాగుందని... దాన్ని మరింత మెరుగు పరిచి తాము కొనసాగిస్తున్నామని... ఈ పరిస్థితుల్లో తమకు ఆయుష్మాన్ భారత్ అవసరం లేదని మోదీకి చెప్పానని కేసీఆర్ తెలిపారు. 108 అంబులెన్స్ పథకం కూడా చాలా బాగుందని ఆయన చెప్పారు.