Chili: చిలీలో భారీ భూకంపం!

  • రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత
  • కోక్వింబో నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో కేంద్రం
  • వేలాది గృహాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం

చిలీలోని ఉత్తర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని నిర్ధారించిన యూఎస్ జియోలాజికల్ సర్వే, రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో ఇది సంభవించిందని పేర్కొంది. భూమి ఉపరితలానికి 53 కిలోమీటర్ల లోతులో, కోక్వింబో నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.

నేటి ఉదయం 6 గంటల సమయంలో (భారత కాలమానం) ఈ భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు రాజధాని శాంటియాగోలోనూ కనిపించాయి. వేలాది గృహాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన నేషనల్ ఎమర్జెన్సీ ఆఫీస్ రంగంలోకి దిగింది. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలపై ఇంకా వివరాలు అందలేదు.

More Telugu News