Jallikattu: జల్లికట్టులో గిన్నిస్ రికార్డు... స్వయంగా ప్రారంభించిన తమిళ సీఎం!

  • పుదుకొట్టై జిల్లా విరాళిమలైలో అతిపెద్ద జల్లికట్టు
  • 2,500 ఎద్దులను వదిలిన నిర్వాహకులు
  • వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన 3 వేల మంది

రంకెలేస్తూ పరుగులు తీసే ఎద్దులు... వాటిని అదుపు చేసి మగాడిననిపించుకోవాలని ఉర్రూతలూగే యువత. సంక్రాంతి సీజన్ లో తమిళనాడులో గ్రామగ్రామాన కనిపించే జల్లికట్టు. ఇప్పుడీ జల్లికట్టు గిన్నిస్ రికార్డును సాధించింది. మొత్తం 2,500 ఎద్దులను ఒక్కొక్కటిగా వదులుతుంటే, వాటిని అదుపు చేసేందుకు 3 వేల మంది యువకులు ప్రయత్నించారు. పుదుకొట్టై జిల్లా విరాళిమలైలో జరిగిన ఈ జల్లికట్టు పోటీలను తమిళనాడు సీఎం పళని స్వామి స్వయంగా ప్రారంభించారు. పోటీలను పరిశీలించేందుకు హాజరైన గిన్నిస్ రికార్డు ప్రతినిధులు, ఇంత పెద్ద స్థాయిలో మరెక్కడా పోటీలు జరగలేదని వ్యాఖ్యానించారు.

More Telugu News