Padipantalu: 'పాడి-పంట' చిన్నమ్మ బతికే ఉన్నారు... క్షమాపణలు కోరిన ఆకాశవాణి!

  • నిర్మలా వసంత్ మరణించారని ప్రకటన
  • ఆపై ఆమె బతికే ఉన్నారని తెలుసుకున్న అధికారులు
  • క్షమాపణలు కోరుతూ ప్రకటన విడుదల

ఆల్ ఇండియా రేడియోలో వచ్చే 'పాడి-పంట' కార్యక్రమంలో 'చిన్నమ్మ'గా సుపరిచితురాలైన నిర్మలా వసంత్ బతికే ఉన్నారని, ఆమె మరణించారని ప్రకటించినందుకు క్షమాపణలు కోరుతున్నామని ఆకాశవాణి ఓ ప్రకటనలో పేర్కొంది. 73 ఏళ్ల వయసులో ఆమె ప్రస్తుతం అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమెను వెంటిలేటర్ పై ఉంచారని ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని తెలిపింది.

ఆమె మరణంపై వచ్చిన వార్తల వెనుక కారణాలను వివరిస్తూ, ఆమె ఆరోగ్యం క్షీణించిన తరువాత, పరిస్థితిని ఆమెతో కలిసి మూడు దశాబ్దాలు పనిచేసిన జ్యోత్సకు వివరించారని, ఈ క్రమంలో 'ఆమె ఇకలేరు' అని చెప్పారని పేర్కొంది. ఆ తరువాత ఉన్నతాధికారులు పరామర్శించేందుకు ఫోన్ చేయగా, ఎవరూ లిఫ్ట్ చేయలేదని, దీంతోనే ఆమె మరణించారని అనుకున్నామని, ఆపై రెండు రోజుల తరువాత సంతాపసభను నిర్వహించామని, ఈ వార్త పత్రికల్లో వచ్చిన తరువాత వారి రెండో అమ్మాయి, జరిగిన పొరపాటును గురించి తమకు తెలిపిందని వెల్లడించింది. దీంతో తాము దిగ్భ్రాంతి చెందామని, నిర్మలా వసంత్‌ కుటుంబసభ్యులు, అభిమానులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది.

More Telugu News