Telangana: ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచార గడువు.. 21న పోలింగ్

  • ఒంటి గంట వరకూ పోలింగ్
  • 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
  • 3701 పంచాయతీల్లో పోలింగ్

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచార గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. మొదటి విడతలో 4479 గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. వీటితో తొమ్మిది పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు.. మరో 769 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3701 పంచాయతీలకు ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరగనుంది.

అలాగే తొలి విడతలో 39,822 వార్డు సభ్యుల పదవులకు నోటిఫికేషన్ జారీ చేయగా.. 192 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 10,654 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. 28,976 వార్డు సభ్యుల పదవులకు ఎన్నిక జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్.. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. నేటి సాయంత్రం నుంచి తొలి విడత పోలింగ్ జరగనున్న పంచాయతీల పరిధిలో మద్యం దుకాణాలు తెరవకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News