Mamatha Benerji: ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీనే బెంగాల్ ప్రభుత్వానికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది: మోదీ

  • నేను దేశ ప్రయోజనాల కోసం పోరాడుతున్నా
  • ర్యాలీలతో ప్రజల హృదయాలను గెలవలేరు
  • మహాకూటమి దేశానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్నది

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో కోల్‌కతా బ్రిగేడ్ మైదానంలో విపక్షాల ఐక్య ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లోని సిల్వసాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మహాకూటమి తనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్నది కాదని.. దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్నదని విమర్శించారు.

ప్రతిపక్ష పార్టీలన్నీ తమని తాము కాపాడుకునేందుకు పోరాడుతుంటే.. తాను మాత్రం దేశ ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని.. ఇదే తనకూ, విపక్షాలకూ ఉన్న తేడా అని అన్నారు. ప.బెంగాల్ అసెంబ్లీలో బీజేపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే వున్న విషయాన్ని గర్వంగా ప్రస్తావిస్త్తూ, ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీనే బెంగాల్ ప్రభుత్వానికి కంటిపై కునుకు లేకుండా చేస్తోందని.. ఆ ఒక్కడి నుంచి కాపాడుకోవడానికి రక్షించమంటూ కేకలు వేస్తున్నారని దెప్పిపొడిచారు. ఇంకా విపక్షాలన్నీ ఏకతాటిపైకి రాకముందే.. వారు మాత్రం ఎన్నికల్లో సీట్ల గురించి చర్చలు జరుపుతున్నారన్నారు. విపక్షాలు ఇలాంటి ర్యాలీలతో వార్తల్లోకెక్కొచ్చు కానీ ప్రజల హృదయాలను మాత్రం గెలవలేవని స్పష్టం చేశారు.

More Telugu News