venkatesh: ఆశ్చర్యపరుస్తోన్న 'ఎఫ్ 2' తొలివారం వసూళ్లు

  • అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 2'
  • నైజామ్ ఏరియా వసూళ్లు 11.80 కోట్లు
  • ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల షేర్      

అనిల్ రావిపూడి మొదటి నుంచి కూడా కామెడీకి ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. ఈ సారి ఆయన కామెడీకి పూర్తి ప్రాధాన్యతనిస్తూ 'ఎఫ్ 2' సినిమా చేశాడు. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా ఆయన చేసిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా థియేటర్లకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. ఈ ఏడాది టాలీవుడ్ కి తొలి హిట్ ను ఇచ్చిన ఘనతను సొంతం చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలివారంలో ఈ సినిమా 35.05 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 43 కోట్ల షేర్ ను రాబట్టింది. తొలివారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 11.80 కోట్లను వసూలు చేయడం విశేషం. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, అనిల్ రావిపూడి తన పారితోషికాన్ని పెంచేశాడనీ .. ఆయనతో సినిమాలు చేయడానికి యువ కథానాయకులు ఉత్సాహాన్ని చూపుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

More Telugu News