Hyderabad: ప్రమాణ స్వీకారం చేసిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

  • ప్రొటెం స్పీకర్‌ ఎదుట ప్రమాణం చేయనని గతంలో ప్రకటించిన సింగ్‌
  • తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు
  • కొత్త స్పీకర్‌ను ఎన్నుకోవడంతో ఆయన చాంబర్‌లో ప్రమాణం

హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన, హిందూ ధర్మం పట్ల  వ్యతిరేకత ఉన్న ఎంఐఎం పార్టీకి చెందిన ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రొటెం స్పీకర్‌గా ఉండగా తాను ప్రమాణం చేయనని భీష్మించుకుని కూర్చున్న హైదరాబాద్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన పంతం నెగ్గించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి ఎదుట ఆయన చాంబర్‌లో ఈరోజు ప్రమాణం చేశారు.

 రాజాసింగ్‌తోపాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు తొలిరోజు సమావేశానికి హాజరు కాని విషయం తెలిసిందే. దీంతో స్పీకర్‌ పోచారం రాజాసింగ్‌తో ఈరోజు ప్రమాణం చేయించారు. రాజాసింగ్‌  హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం మాట్లాడుతూ హిందూధర్మం పట్ల వ్యతిరేకత ఉన్న ఎంఐఎం శాసన సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడంపై సీఎం కేసీఆర్‌ ఆలోచన చేయాల్సిందన్నారు. కేసీఆర్‌ కోరుకుంటున్న బంగారు తెలంగాణ కావాలంటే అందరినీ కలుపుకొని పోవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. 

More Telugu News