Mahesh Babu: 'మహర్షి' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు

  • మహేశ్ 25వ సినిమాగా 'మహర్షి'
  • మహాశివరాత్రి రోజున టీజర్ రిలీజ్
  •  ఆ రోజునే విడుదల తేదీ ప్రకటన  

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' షూటింగ్ జరుగుతోంది. మహేశ్ బాబు 25వ సినిమాగా ఇది రూపొందుతోంది. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా నుంచి వదులుతోన్న పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ముందే ప్రకటించారు. దాంతో ఇక త్వరలోనే టీజర్లు .. ట్రైలర్లు సందడి చేస్తాయని అభిమానులు భావించారు.

కానీ ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందువల్లనే కాస్త ఆలస్యంగానే టీజర్ వస్తోంది. 'మహాశివరాత్రి' సందర్భంగా మార్చి 4వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా సమాచారం. దాదాపు ఈ తేదీ ఖరారైపోయిందని అంటున్నారు. ఆ రోజునే టీజర్ ద్వారా విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను చేస్తోన్న సంగతి తెలిసిందే.

More Telugu News