balakrishna: బాలకృష్ణతో కలిసి బోయపాటి సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే

  • బాలకృష్ణ తదుపరి సినిమా బోయపాటితో
  • ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
  • గతంలో ఇద్దరి కాంబినేషన్లో రెండు హిట్లు   

బాలకృష్ణ తన తదుపరి సినిమా బోయపాటి శ్రీనుతో ఉంటుందని చెప్పారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. రికార్డు స్థాయి వసూళ్లను తెచ్చిపెట్టాయి. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో రానున్న మూడవ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి వుంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

ఫిబ్రవరిలో ఈ సినిమాను లాంచ్ చేయవచ్చనే టాక్ వినిపించింది. కానీ ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం. ఈ లోగా బోయపాటి స్క్రిప్ట్ ను పక్కాగా సిద్ధం చేసుకుని .. మిగతా పనులు కూడా పూర్తి చేసేస్తాడట. ఈ సంక్రాంతికి 'కథానాయకుడు'తో బాలకృష్ణ .. 'వినయ విధేయ రామ'తో బోయపాటి బరిలోకి దిగినా పెద్దగా ఫలితం పొందలేదు. మరిప్పుడు ఇద్దరూ కలిసి హిట్ కొడతారేమో చూడాలి. 

More Telugu News