anil ravipudi: మహేశ్ బాబు నా భుజం తట్టి ప్రోత్సహించారు: అనిల్ రావిపూడి

  • వెంకటేశ్ గారు ఓ లైబ్రరీ
  • వరుణ్ తేజ్ తో మళ్లీ చేయాలనుంది
  • మహేశ్ బాబు గారికి కృతజ్ఞతలు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 2' సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్స్ లో సందడి చేస్తోంది. థియేటర్స్ లో నాన్ స్టాప్ నవ్వులు కురిపిస్తోన్న ఈ సినిమా, బయ్యర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. అనిల్ రావిపూడి కెరియర్లోనే ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ వేదికపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. " వెంకటేశ్ గారు ఓ లైబ్రరీ .. ఈ  జర్నీలో ఆయన నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. ఆయన టైమింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక వరుణ్ తేజ్ చాలా బాగా చేశాడు .. ఆయనతో మళ్లీ ఒక సినిమా చేయాలనుంది. ఈ సందర్భంగా నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను .. ఆయనే మహేశ్ బాబు.

ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మహేశ్ బాబు గారు చేసిన ప్రతి ట్వీట్ కిక్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ కాగానే చూసి అభినందించారు. ఆయన ఇలా భుజం తట్టి ప్రోత్సహించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మా టీమ్ తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News