Saipallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • దుమ్మురేపుతున్న సాయిపల్లవి పాట 
  • సల్మాన్ ఖాన్ సినిమాలో 'ఈగ' విలన్ 
  • హిట్ సినిమా రీమేక్ లో సమంత, శర్వానంద్  

*  కథానాయిక సాయిపల్లవి నటించిన సాంగ్ ఒకటి యూ ట్యూబ్ లో దుమ్మురేపుతోంది. 'మారి 2' సినిమా కోసం ధనుష్ తో కలసి ఆమె నటించిన 'రౌడీ బేబీ' పాట యూ ట్యూబ్ లో విడుదలైన పదిహేను రోజుల్లోనే 94 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.
*  ప్రముఖ కన్నడ నటుడు 'ఈగ' సుదీప్ మళ్లీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ నటించే 'దబాంగ్ 3' చిత్రంలో సుదీప్ విలన్ పాత్రను పోషించనున్నాడు. ప్రభుదేవా దీనికి దర్శకత్వం వహిస్తాడు.
*  ఇటీవల తమిళంలో వచ్చిన '96' చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో సమంత, శర్వానంద్ జంటగా నటించనుండగా, తమిళ వెర్షన్ కి దర్శకత్వం వహించిన ప్రేమ కుమార్ దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

More Telugu News