Rakul Preeth: నాకూ, రకుల్‌కు వచ్చే చెత్త సందేశాలను షేర్ చేస్తే అందులో కొట్టుకుపోతారు: చిన్మయి

  • అత్యాచారం చేస్తామని ఎన్నో ట్వీట్లు
  • తమకు రాసిచ్చేసినట్టు భావిస్తున్నారు
  • పోలీసులకు భారం ఎక్కువైపోతోంది

తనను కారణం లేకుండా తిట్టిపోస్తున్నారని.. గతంలో కంటే ఇప్పడు సోషల్ మీడియాలో తనకు వేధింపులు ఎక్కువయ్యాయని గాయని చిన్మయి శ్రీపాద తెలిపారు. సాహిత్య రచయిత వైరముత్తు తనను హోటల్ గదికి రమ్మని ఓ వ్యక్తితో కబురు పంపారని ‘మీటూ’ ఉద్యమ సమయంలో ఆమె వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఓ నెటిజన్ చిన్మయిని అసభ్యకరంగా విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన చిన్మయి, ఇలాంటి వాళ్లు ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నా సౌమ్యంగా ఉండాలంటూ వరుస ట్వీట్లు చేశారు.

‘సోషల్‌మీడియాలో మనల్ని విమర్శించడానికి ఈ రకం మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్లు అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పటికీ.. మనం సౌమ్యంగా ఉండాలి. ఇలాంటి మూర్ఖుల్ని ‘అన్నా’, ‘సర్‌’ అని పిలవాలి. ఇలాంటి వారు ఎందుకు ప్రాణాలతో ఉంటారో నాకు అర్థం కాదు, ఆశ్చర్యం వేస్తుంది. నేను ఓ గాయని అయినప్పటికీ అత్యాచారం చేస్తామని ఎన్నో ట్వీట్లు, ఈమెయిళ్లు చేస్తున్నారు. మహిళల్ని తమకు రాసిచ్చేసినట్లు చాలా మంది పురుషులు భావిస్తున్నారు. ఈ విషయంలో ట్విట్టర్‌ ఏమీ చేయదు. పోలీసులకు భారం ఎక్కువైపోతోంది. నాకు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు, మిగిలిన నటీమణులకు రోజూ వచ్చే ఇలాంటి చెత్త సందేశాలను షేర్‌ చేస్తే మీరు అందులో కొట్టుకుపోతారు. సమాజం మారింది.. కానీ ఇంకా చాలా మారాలి. మహిళలు ఓపికగా ఉండాలి’’ అని ఆమె పేర్కొన్నారు.

More Telugu News