Telangana: కేసీఆర్ జీ.. రేపు కోల్ కతా ర్యాలీకి రండి!: ఆహ్వానించిన మమతా బెనర్జీ

  • తెలంగాణ సీఎంకు టీఎంసీ అధినేత్రి ఫోన్
  • 20 మంది నేతలు హాజరవుతున్నారన్న మమత
  • దూరంగా ఉండాలనుకుంటున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈరోజు ఫోన్ చేశారు. రేపు కోల్ కతాలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నిర్వహించనున్న విపక్షాల ర్యాలీకి హాజరుకావాలని ఈ సందర్భంగా ఆమె ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన 20 మందికి పైగా నేతలు హాజరు అవుతున్నట్లు మమత కేసీఆర్ కు వివరించారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటున్న ఈ ర్యాలీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా, రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవాలనే లక్ష్యంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మమతా బెనర్జీతో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ మాజీ సీఎంలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ లతో భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును కేసీఆర్ ప్రతిపాదించారు.

More Telugu News