ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన లగడపాటి రాజగోపాల్!

- శుభకార్యానికి రావాల్సిందిగా ఆహ్వానం
- ఫెడరల్ ఫ్రంట్ పై నో కామెంట్
- తెలంగాణలో ఎన్నికల్లో తప్పిన అంచనాలు
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబంలో జరిగే శుభకార్యం కోసం సీఎంను ఆహ్వానించేందుకే వచ్చానని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ పై తాను ఇప్పుడేమీ వ్యాఖ్యానించబోనని స్పష్టం చేశారు. అనంతరం తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలవుతుందని తన సర్వేలో తేలినట్లు లగడపాటి రాజగోపాల్ అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గానూ టీఆర్ఎస్ 88 సీట్లు దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.