ayesha murder: అయేషా మీరా హత్య కేసు విచారణను వేగవంతం చేసిన సీబీఐ

  • సత్యంబాబును విచారిస్తున్న అధికారులు
  • ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలం నమోదు
  • హాస్టల్‌ నిర్వాహకులను విచారించనున్న అధికారులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వేగవంతం చేసింది. విజయవాడ పరిధి ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న సమయంలో అయేషా హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆమెపై సామూహిక అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేశారని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సత్యంబాబును అరెస్టు చేయడం, కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయడం తెలిసిందే. అయితే ఈ కేసులో అసలు దోషుల్ని పట్టుకోవాలంటూ బాధిత కుటుంబం వేసిన పిటిషన్‌ ను పరిశీలించిన హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ కేసును వేగవంతం చేసింది.

నందిగామ అనాససాగరంలోని సత్యంబాబు ఇంటికి నేటి ఉదయం చేరుకున్న సీబీఐ అధికారులు పలు అంశాలపై అతన్ని ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తున్నారు. అయేష హత్య జరిగిన హాస్టల్‌ నిర్వాహకులను కూడా సీబీఐ అధికారులు విచారించనున్నారని సమాచారం.

More Telugu News