kamal: 'భారతీయుడు 2'లో శింబు స్థానంలో సిద్ధార్థ్

  • లైకా ప్రొడక్షన్స్ నుంచి 'భారతీయుడు 2'
  • ఈ రోజే మొదలైన రెగ్యులర్ షూటింగ్
  •  ముఖ్యమైన పాత్రలో దుల్కర్ సల్మాన్  

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'భారతీయుడు 2' సినిమా నిర్మితమవుతోంది. శంకర్ దర్శకత్వంలో ఈ రోజునే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కమల్ సరసన కథానాయికగా కాజల్ నటిస్తోంది. ఈ సినిమాలో సేనాపతి మనవడి పాత్రలో శింబు నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సిద్ధార్థ్ పేరు తెరపైకి వచ్చింది.

కొన్ని కారణాల వలన శింబు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తిని చూపలేదనీ, అందువలన ఆయనకి బదులుగా సిద్ధార్థ్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నిజంగా ఈ ఛాన్స్ సిద్ధార్థ్ కి వచ్చి వుంటే, అది ఆయన కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కొన్నాళ్లుగా సిద్ధార్థ్ రేసులో పూర్తిగా వెనుకబడిపోయిన విషయం తెలిసిందే. ఇక మరో ముఖ్యమైన పాత్రలో దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు. దాదాపు 8 దేశాలలో ఈ సినిమా షూటింగును జరపనున్నారు. 

More Telugu News