SAI: అవినీతి ఆరోపణలు.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల అరెస్టు

  • ఎస్ఏఐ డైరెక్టర్ అరెస్టు
  • మరో ముగ్గురు అధికారులు, ఇద్దరు వ్యక్తులు కూడా
  • విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు

అవినీతి ఆరోపణల నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) డైరెక్టర్ ఎస్ కే శర్మను అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు అధికారులు
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ హరీందర్ ప్రసాద్, సూపర్ వైజర్ లలిత్ జోలి, యూడీసీ వీకే శర్మను, ప్రైవేట్ కాంట్రాక్టర్ మన్ దీప్ అహుజ, అతని వద్ద పని చేసే యూనస్ లను అరెస్టు చేసినట్టు అధికారులు చెప్పారు.

ఢిల్లీలోని లోడీ రోడ్డులో ఉన్న ఎస్ఏఐ పరిపాలనా కార్యాలయంలో తనిఖీలు జరిగిన సమయంలో వీరిని అరెస్టు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఉన్న ఎస్ఏఐ హెడ్ క్వార్టర్స్ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించట్లేదు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

కాగా, పెండింగ్ లో ఉన్న రూ.19 లక్షలకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేసే నిమిత్తం అందులో మూడు శాతం మొత్తాన్ని తమకు ఇవ్వాలని ఎస్ఏఐ అధికారులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు.

More Telugu News