ఎస్పీ, బీఎస్పీ పొత్తును కులవాదులు విమర్శిస్తున్నారు: మాయావతి

17-01-2019 Thu 20:56
  • దళిత వ్యతిరేకుల అభ్యంతరకర వ్యాఖ్యలు తగదు
  • ఎన్నికలకు ముందు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు
  • మా తమ్ముడి కుమారుడు బీఎస్పీలో చేరుతున్నాడు

యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తును కులవాదులు వ్యతిరేకిస్తున్నారని, దళిత వ్యతిరేకులు తమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని మాయావతి విమర్శించారు. ఈ వ్యాఖ్యలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. వారికి అనుకూలమైన టీవీ ఛానెళ్లలో ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై ఆరోపణలు చేయడం ప్రారంభించారని అన్నారు.

 లోక్ సభ ఎన్నికలకు ముందు తమని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శిస్తూ, తన చిన్న తమ్ముడి కుమారుడు ఆకాష్ ఆనంద్ బీఎస్పీలో చేరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. దేశ రాజకీయాలను, బీఎస్పీ పోరాటాన్ని అర్థం చేసుకోవడానికి అతనికి ఇదో మంచి అవకాశమని అన్నారు. తన వారసుడిగా ఆకాష్ ని బీఎస్పీలో చేర్చుకుంటున్నామంటూ పలు పార్టీలు, కులవాదులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తాము పట్టించుకోమని తేల్చి చెప్పారు.