mahakutami: ‘మహాకూటమి’ ఏర్పాటు ఎప్పటికీ సాధ్యం కాదు: రాంమాధవ్

  • ‘మహాకూటమి’ పార్టీలకు ఒక సిద్ధాంతం లేదు
  • మోదీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకే
  •  వచ్చే ఎన్నికల్లో కనివినీ ఎరుగని విజయం సాధిస్తాం 

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలన్న లక్ష్యంతో బీజేపీయేతర పక్షాలన్నీ ‘మహాకూటమి’ పేరుతో జతకట్టే యత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మహాకూటమి’ పేరుతో కలవాలనుకున్న పార్టీలకు ఒక సిద్ధాంతం కానీ, ఉమ్మడి లేదా నమ్మదగిన అజెండా కానీ లేవని విమర్శించారు. ‘మహాకూటమి’ అంటూ హడావిడి చేస్తున్న పార్టీలకు ఇవేవీ లేకపోయినా కూటమి ఏర్పాటు చేయాలని ఆరాటపడుతున్నారని, అది ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదని అభిప్రాయపడ్డారు.

కేవలం, మోదీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలన్న తలంపుతోనే పొత్తులు కుదుర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. మోదీ ఎటువంటి మచ్చ లేని నాయకుడని, ఆయనతో సరితూగే నాయకుడు ఈ దేశంలో లేరని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటామని ధీమాగా చెప్పారు. 

More Telugu News