yogi: యోగికి అవకాశం.. పశ్చిమబెంగాల్ లో అమిత్ షా స్థానంలో పాదయాత్ర

  • స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న అమిత్ షా
  • జనవరి 20 నుంచి పశ్చిమబెంగాల్ లో ప్రారంభంకానున్న బీజేపీ ర్యాలీలు
  • అమిత్ కోలుకోకపోతే.. యోగి నేతృత్వంలో యాత్రలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వైన్ ఫ్లూతో బాధ పడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది.

మరోవైపు, జనవరి 20 నుంచి పశ్చిమబెంగాల్ లో బీజేపీ వరుస ర్యాలీలు ప్రారంభం కానున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఫిబ్రవరి మొదటి వారం వరకు ఇవి కొనసాగనున్నాయి. వీటిలో పాదయాత్రలు కూడా ఉన్నాయి. మరోవైపు, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ పశ్చిమబెంగాల్ లో రథయాత్రలకు అనుమతి ఇవ్వలేమని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో బహిరంగసభలు, పాదయాత్రలకు బీజేపీ ప్లాన్ చేసింది.

ఈ నేపథ్యంలో, జనవరి 20 నాటికి అమిత్ షా పూర్తి స్థాయిలో కోలుకోకపోతే...  ఆయన స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ యాత్రలకు నాయకత్వం వహిస్తారు. ఫిబ్రవరి 8న జరిగే చివరి ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

More Telugu News