balakrishna: 'మహానాయకుడు' కొత్త రిలీజ్ డేట్ ఇదే !

  • ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంగా 'మహానాయకుడు'
  • ముందుగా ప్రకటించిన విడుదల తేదీ ఫిబ్రవరి 7 
  • కొత్తగా చెప్పిన రిలీజ్ డేట్ ఫిబ్రవరి 14  

ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగమైన 'కథానాయకుడు' సంక్రాంతి కానుకగా థియేటర్లకు వచ్చింది. ఇక నందమూరి అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'మహానాయకుడు'పై వుంది. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం సరిపోకపోవచ్చనే ఉద్దేశంతో ఫిబ్రవరి 14వ తేదీకి విడుదలను వాయిదా వేశారు.

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం .. ఆ ప్రయాణంలో ఆయనకి ఎదురైన పరిస్థితులను ఈ భాగంలో చూపించనున్నారు. చంద్రబాబుగా రానా .. హరికృష్ణగా కల్యాణ్ రామ్ పాత్రలు పూర్తిస్థాయిలో కనిపించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 'మహానాయకుడు'లో ఎన్టీఆర్ గా బాలకృష్ణ మరింత బాగా కుదిరారనే టాక్ వుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఎంతలా మెప్పిస్తారో .. ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి. 

More Telugu News