varn tej: మెగా హీరో మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్

  • బాక్సింగ్ కోచ్ గా వరుణ్ తేజ్
  • వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్
  • డిఫరెంట్ గా డిజైన్ చేసిన పాత్రలో అర్జున్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేసిన 'ఎఫ్ 2' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా తరువాత కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సింగ్ కోచ్ గా కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన శిక్షణ తీసుకునే పనిలో ఆయన బిజీగా వున్నాడు.

అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకోసం యాక్షన్ కింగ్ అర్జున్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో అర్జున్ తమిళ - తెలుగు భాషల్లో విలన్ గాను మెప్పిస్తొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్జున్ రోల్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారట. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. కథానాయిక ఎంపిక ప్రక్రియ పూర్తికావలసి వుంది.

More Telugu News