'వినయ విధేయ రామ' సెకండాఫ్ కేవలం ఫైట్స్ కోసమే తీసినట్టుగా అనిపించింది!: తమ్మారెడ్డి భరద్వాజ

- 'కథానాయకుడు' సెకండాఫ్ పై మరింత శ్రద్ధ పెట్టాల్సింది
- 'వినయ విధేయ రామ' సెకండాఫ్ లో ఫైట్స్ ఎక్కువ
- 'ఎఫ్ 2'కి కామెడీ డ్రామా కలిసొచ్చింది
ఫ్యామిలీ డ్రామాకి కామెడీ కూడా తోడు కావడం వలన,'ఎఫ్ 2' సినిమా బాగా ఆడుతోందని చెప్పారు. ఇక 'వినయ విధేయ రామ' విషయానికొస్తే, నటుడిగా 'రంగస్థలం' సినిమాకి ముందు చరణ్ వేరు .. తరువాత చరణ్ వేరు. ఆయన బోయపాటితో చేస్తున్నాడనగానే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. బోయపాటి తన మార్క్ లోనే ఈ సినిమా తీశాడు. అయితే సెకండాఫ్ కేవలం ఫైట్స్ కోసమే తీసినట్టుగా అనిపించడం అభిమానుల అసహనానికి కారణమైంది. సక్సెస్ .. ఫెయిల్యూర్ అనేవి ఎప్పుడూ ఒకచోట వుండవు. ఎవరి ప్రయత్నం వాళ్లు చేశారంతే" అని చెప్పుకొచ్చారు.