venkatesh: ఐదో రోజున అత్యధిక వసూళ్లను రాబట్టిన 'ఎఫ్ 2'

  • ఈ నెల 12న వచ్చిన 'ఎఫ్ 2'
  • అయిదు రోజుల్లో 32 కోట్ల షేర్ 
  • ఈ వీకెండ్ లోను అదే జోరు  

సంక్రాంతి కానుకగా 'ఎఫ్ 2' సినిమా ఈ నెల 12వ తేదీన విడుదలైంది. అప్పటికే థియేటర్స్ లో 'కథానాయకుడు' .. 'వినయ విధేయ రామ' వున్నాయి. అలాంటి పరిస్థితుల్లో 'ఎఫ్ 2'ను వదలడం సాహసమే అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా 'ఎఫ్ 2' తన జోరును కొనసాగిస్తోంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.

తొలి నాలుగు రోజుల కంటే ఎక్కువ వసూళ్లను 5వ రోజున ఈ సినిమా రాబట్టడం విశేషం. తొలి 4 రోజుల్లో 26 కోట్ల షేర్ ను సాధించిన ఈ సినిమా, 5వ రోజున 6.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది. దాంతో 5 రోజుల్లో ఈ సినిమా 32 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. ఇక ఈ వారాంతంలో కొత్తగా వచ్చే సినిమాలేవీ లేవు. అందువలన ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. లాంగ్ రన్ లో ఈ సినిమా 60 కోట్ల షేర్ మార్కును అందుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

More Telugu News