karthikeya: 'ఆర్ ఎక్స్ 100' హీరో కొత్త చిత్రం షూటింగ్ మొదలు

  • 'ఆర్ ఎక్స్ 100' హీరోతో అర్జున్ జంధ్యాల 
  • ఒంగోలులో రెగ్యులర్ షూటింగ్ మొదలు
  • త్వరలో మిగతా వివరాలు    

కార్తికేయ కథానాయకుడిగా వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' భారీ విజయాన్ని అందుకుని, ఆయనకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. దాంతో ఈ హీరోతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. గతంలో బోయపాటి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల, ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను ఒంగోలులో ప్లాన్ చేశాడు.

అక్కడ ఈ రోజున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా నిర్మాతలు అనిల్ కడియాల .. తిరుమల రెడ్డి మాట్లాడుతూ, 'ఈ రోజు నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు, రెండు పాటలను కూడా ఇక్కడ చిత్రీకరించనున్నాము. హీరోయిన్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది .. త్వరలో మిగతా వివరాలు తెలియజేస్తాము' అని అన్నారు. 

More Telugu News