nagachaitanya: 'మజిలీ'లో ఆ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయట!

  • శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ'
  • ప్రత్యేక పాత్రలో దివ్యాంశ కౌశిక్
  • ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు       

నాగ చైతన్య .. సమంత జంటగా శివ నిర్వాణ 'మజిలీ' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. విభిన్నమైన కంటెంట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణను జరుపుకుంది. 1990 నాటి ప్రేమకథ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. నాగచైతన్య .. సమంత కాంబినేషన్లో వచ్చే రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ రొమాంటిక్స్ సీన్స్ ను చాలా సహజంగా చిత్రీకరించారని సమాచారం.

ఈ సినిమాలో సమంతతో పెళ్లికి ముందు ఒక లుక్ తో .. పెళ్లి తరువాత మరో లుక్ తో చైతూ కనిపిస్తాడని అంటున్నారు. దివ్యాంశ కౌశిక్ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. పెళ్లైన తరువాత చైతూ .. సమంత కలిసి చేస్తోన్న సినిమా కావడం, అందునా ప్రేమికులుగా .. ఆ తరువాత భార్యాభర్తలుగా ఈ సినిమాలో వాళ్లిద్దరూ కనిపించనుండటం వలన అందరిలోనూ ఆసక్తి వుంది. 

More Telugu News