Honor 10 Lite: భారత్ కు వచ్చేసిన 'ఆనర్ 10 లైట్'.. క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన జియో

  • ఢిల్లీలో విడుదలైన 'ఆనర్ 10 లైట్'
  • రెండు వేరియంట్ లలో లభ్యం 
  • ఈనెల 20 నుండి ఆన్ లైన్ లో విక్రయం

ప్రముఖ మొబైల్ దిగ్గజ సంస్థ ఆనర్ తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తన నూతన స్మార్ట్ ఫోన్ 'ఆనర్ 10 లైట్' ను లాంచ్ చేసింది. ఆనర్ ఇండియా స్టోర్లతో పాటు ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా విక్రయించనున్న ఈ ఫోన్ మనదేశంలో 4 జీబీ/6 జీబీ వేరియంట్లలో లభించనుంది. 4 జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ ధర రూ.13,999 ఉండగా, 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. ఈనెల 20 నుండి ఆన్ లైన్లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ పై జియో తన వినియోగదారుల కోసం రూ.2200 వోచర్ల రూపంలో క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. అలాగే, దీనితో పాటు రూ.2800 విలువ గల క్లియ‌ర్ ట్రిప్ వోచ‌ర్ల‌ను కూడా కస్టమర్లు పొందనున్నారు.

More Telugu News