Telangana: మోదీ, రాహుల్! కేసీఆర్ ను చూసి నేర్చుకోండి!: అసదుద్దీన్ ఒవైసీ చురకలు

  • తెలంగాణ సీఎంపై అసద్ ప్రశంసలు
  • రైతు బంధు వినూత్న పథకమని వ్యాఖ్య
  • ఇలాంటి పథకాలు దేశానికి కావాలన్న ఒవైసీ

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలని చురకలు అంటించారు. దేశానికి ఇలాంటి వినూత్నమైన పథకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ పథకాన్ని కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం అమలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో అసద్ స్పందించారు. ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఈ ట్వీట్ కు ఆయన జతచేశారు.

More Telugu News