sneha: మా పెళ్లి ప్రసన్న వాళ్లింట్లో ఇష్టం లేదు: హీరోయిన్ స్నేహ

  • నా కోసం ప్రసన్న టాటూ వేయించుకున్నాడు
  • ఆయన కోసం నేను బంగీ జంప్ చేశాను
  • మా పెళ్లికి మా ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు  

పెళ్లి తరువాత నేను .. ప్రసన్న ఇద్దరం హనీమూన్ కి వెళ్లాము. ప్రసన్నకి బంగీ జంప్ చేయడం ఇష్టం .. తనతో కలిసి బంగీ జంప్ చేయమన్నాడు. ఆయనకి టాటూలు వేయించుకోవడం ఇష్టం ఉండదు. అందువలన 'నువ్వు టాటూ వేయించుకో .. నీతో బంగీ జంప్ చేస్తాను' అని చెప్పాను. నిజానికి ఎత్తుపై నుంచి చూడటానికే నాకు భయం. తప్పించుకోవడానికే నేను అలా చెప్పాను .. కానీ నిజంగానే ఆయన నా పేరు టాటూ వేయించుకుని వచ్చారు.

దాంతో ఇద్దరం కలిసి బంగీ జంప్ చేశాము .. భయపడుతూనే. బంగీ జంప్ చేస్తూనే ఆయన 'ఐలవ్ యూ' చెప్పడం మరిచిపోలేను. ఇక మా పెళ్లి విషయానికి వస్తే, మా ఇంట్లో అందరికీ ఇష్టమే. వాళ్ల ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు. దాంతో ఆయన ఇంట్లో వాళ్లతో ఏడాదిపాటు ఫైట్ చేసి నన్ను చేసుకున్నారు. పెళ్లి తరువాత .. నేను కోడలిగా రావడం పట్ల మా అత్తామామలు ఆనందాన్ని వ్యక్తం చేశారు" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News