Pepsi co: ప్రతిష్ఠాత్మక పదవికి ఇంద్రానూయి పేరు ప్రతిపాదన... స్వయంగా నామినేట్ చేసిన ఇవాంకా ట్రంప్!

  • ఆగస్టు 2018లో పెప్సీ కోను వీడిన ఇంద్రనూయి
  • వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష పదవికి నామినేషన్
  • సభ్య దేశాలు ఆమోదించే అవకాశాలు

పెప్సీ కో కంపెనీని వీడిన ఇంద్రనూయికి మరో ప్రతిష్ఠాత్మక ఆఫర్ వచ్చింది. ఆమెను వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నామినేట్‌ చేసినట్టు 'న్యూయార్క్‌ టైమ్స్‌' వెల్లడించింది. స్వయంగా అమెరికాయే ప్రతిపాదించడంతో, ఇంద్రనూయి ఆ పదవిని చేపట్టే అవకాశాలు పుష్కలమని తెలుస్తోంది. ప్రపంచ బ్యాంక్‌ ప్రస్తుత అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ ఫిబ్రవరి 1న బాధ్యతల నుంచి తప్పుకోనున్నారన్న సంగతి తెలిసిందే.

దీంతో అధ్యక్ష ఎన్నిక అనివార్యం కాగా, 12 ఏళ్లు పెప్సీ కో సీఈఓగా పనిచేసిన ఇంద్రనూయి పేరు తెరపైకి వచ్చింది. గత సంవత్సరం ఆగస్ట్‌ లో పెప్సీ కో నుంచి ఇంద్రనూయి వైదొలగారు. వరల్డ్ బ్యాంక్‌ లో అతిపెద్ద భాగస్వామిగా అమెరికా ఉన్నందున, ఆ దేశం సూచించిన వ్యక్తికే పదవి దక్కే అవకాశాలు పుష్కలం. ఇక ఇవాంక నామినేషన్ ను పలు సభ్య దేశాలు ఆమోదించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యంత శక్తిమంతురాలైన మహిళల జాబితాలో ఇంద్రనూయి పేరు పలుమార్లు చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News