paruchuri: త్రివిక్రమ్ కొత్త కోణంలో ఆలోచిస్తారు: పరుచూరి గోపాలకృష్ణ

  • అత్తను ఆటపట్టించే కథలు రాశాము
  • మరికొందరు రచయితలు అదే బాటలో నడిచారు
  • 'అత్తారింటికి దారేది'లో అత్తను గౌరవించాడు  

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో త్రివిక్రమ్ గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. "త్రివిక్రమ్ కొత్త కోణంలో ఆలోచిస్తారు. ఆయన చేసిన 'అత్తారింటికి దారేది' సినిమా నాకు చాలా బాగా నచ్చింది. మేము .. మాతో పాటు కొంతమంది రచయితలు అత్తను అల్లరి చేసే కథలు రాశాము.

'అనసూయమ్మగారి అల్లుడు'.. 'బొబ్బిలి రాజా' .. 'అత్తకి యముడు అమ్మాయికి మొగుడు' .. 'అల్లరి అల్లుడు' వంటి సినిమాలు మేము రాశాము. చలం .. ఎస్. వరలక్ష్మి 'బొమ్మా బొరుసా' సినిమా నుంచి మేమంతా ప్రేరణ పొందాము. కానీ త్రివిక్రమ్ కొత్త కోణంలో ఆలోచించాడు. అత్తని గౌరవించి తీసుకెళ్లడం ఈ సినిమాలో కనిపిస్తుంది. అత్తని ఒక్క మాట అనడం మనం 'అత్తారింటికి దారేది' సినిమాలో చూడము. త్రివిక్రమ్ కొత్తగా ఆలోచించడం వల్లనే ఆ సినిమా అంతగా జనంలోకి వెళ్లింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News