Hyderabad: హైదరాబాద్ నడిరోడ్డుపై కారులో మంటలు!

  • అఫ్జల్ గంజ్ సమీపంలో ఘటన
  • పార్క్ చేసివున్న కారు నుంచి మంటలు
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఇటీవలి కాలంలో నడిరోడ్డుపై ఉన్నట్టుండి దగ్ధమవుతున్న వాహనాల ఘటనలు పెరిగిపోయాయి. కారులో ఎలక్ట్రికల్ కనెక్షన్లను తప్పుగా బిగించడం, కారులో వాడే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల సంఖ్య పెరిగిపోవడమే ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా హైదరాబాద్, అఫ్జల్ గంజ్ సమీపంలో నిత్యమూ బిజీగా ఉండే సిటీ సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా, ఓ కారు దగ్ధమైంది. పార్కింగ్ చేసివున్న కారు నుంచి మంటలు రాగా, విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో అఫ్జల్ గంజ్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కారులో మంటలు ఎందుకు చెలరేగాయన్న విషయమై విచారణ ప్రారంభించారు.

More Telugu News