China: హైపర్ సోనిక్ మిసైల్స్ విషయంలో అమెరికాను దాటేసిన చైనా: అంగీకరించిన పెంటగాన్

  • అత్యాధునిక ఆయుధ వ్యవస్థగా రూపొందుతోంది
  • ప్రత్యర్థులను దాటేసిన చైనా ఆర్మీ
  • 'చైనా మిలటరీ పవర్' పేరిట పెంటగాన్ నివేదిక

ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధ వ్యవస్థగా రూపొందే మార్గంలో హైపర్ సానిక్ ఆయుధ సాంకేతికత, మిసైల్స్ తయారీలో చైనా ముందంజ వేసిందని పెంటగాన్ స్వయంగా వ్యాఖ్యానించింది. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ పేరిట ఓ నివేదిక విడుదల కాగా, వివిధ రకాల సాంకేతికతల విషయంలో చైనా ముందుంది.

 నావెల్ డిజైన్, మీడియమ్, ఇంటర్ మీడియేట్ రేంజ్ మిసైల్స్, హైపర్ సోనిక్ ఆయుధాల టెక్నాలజీలో ప్రత్యర్థులను దాటేసిందని పేర్కొంది. ధ్వని కన్నా వేగంగా వెళ్లే మిసైల్స్ తయారీలో అమెరికా కన్నా కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ముందుకెళ్లిందని తెలిపింది. 'చైనా మిలటరీ పవర్' పేరిట ఈ నివేదిక విడుదల కాగా, దీనిపై చైనా ఇంకా స్పందించాల్సి వుంది. ఇక చైనా సాంకేతిక అభివృద్ధిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని పెంటగాన్ అధికారి ఒకరు వెల్లడించారు.

More Telugu News