dating: డేటింగ్ కు వెళ్లిన అమ్మాయి బాగోలేదు.. దాంతో అక్కడి నుంచి పారిపోయా!: విరాట్ కోహ్లీ పాత ఇంటర్వ్యూ వైరల్

  • ఆస్ట్రేలియా జర్నలిస్ట్ డెన్నిస్ పోస్ట్
  • 11 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూలో కోహ్లీ వ్యాఖ్యలు
  • రాజుకుంటున్న వివాదం 

భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో అమ్మాయిలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, జట్టు నుంచి స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, విరాట్ కోహ్లీ 19 ఏళ్ల వయసులో చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం వివాదం రాజుకుంటోంది.

అనూషా దండేకర్ కు 11 ఏళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. తాను ఓ అమ్మాయితో బ్లైండ్ డేటింగ్ కు వెళ్లానని తెలిపాడు. అయితే ఆ అమ్మాయి అంద విహీనంగా ఉండటంతో తాను అక్కడి నుంచి పారిపోయానని చెప్పాడు. ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ఎమ్మెస్ డెన్నిస్ తాజాగా ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 

More Telugu News