balakrishna: బాలకృష్ణతో సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చిన వినాయక్

  • 'మహానాయకుడు' పనుల్లో బాలకృష్ణ 
  • బోయపాటి, అనిల్ రావిపూడి లతో చిత్రాలు 
  • ఈ ఏడాదిలోనే వినాయక్ తోనూ మూవీ   

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు 'కథానాయకుడు'ను తీసుకొచ్చిన బాలకృష్ణ, ప్రస్తుతం 'మహానాయకుడు' సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమా తరువాత ఆయన బోయపాటితోను .. అనిల్ రావిపూడితోను చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో కొంతకాలంగా బాలకృష్ణతో సినిమా చేయడానికి వినాయక్ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించలేదని అనుకున్నారు.

ఇక ఇప్పట్లో వినాయక్ తో బాలకృష్ణ సినిమా ఉండకపోవచ్చని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ, బాలకృష్ణతో తన సినిమా ఉందని అన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందనీ .. ఈ ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు ఉంటుందని చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టు బాలకృష్ణతో బోయపాటి సినిమా తరువాత ఉంటుందా? అనిల్ రావిపూడి సినిమా తరువాత ఉంటుందా? అనేది చూడాలి. గతంలో బాలకృష్ణ .. వినాయక్ కాంబినేషన్లో 'చెన్నకేశవ రెడ్డి'వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News