Central Government: టీచర్లకు కూడా ఏడవ వేతన సంఘం సిఫార్సులు వర్తింపు.. దస్త్రానికి కేంద్రం ఆమోదం!

  • మరింత మంది ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపు 
  • ఉపాద్యాయులకు, ఎయిడెడ్ ఉద్యోగులకు కూడా వేతనాల పెంపు
  • ప్రభుత్వంపై రూ. 1241.78 కోట్ల అదనపు భారం 

మరింత మంది ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం సంక్రాంతి కానుకను అందించింది. ఏడవ వేతన సంఘం సిఫార్సులను ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ అకడమిక్‌ ఉద్యోగులు, ప్రభుత్వ ఎయిడెడ్‌ సాంకేతిక విద్యాసంస్ధల ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. మంగళవారం ఈ దస్త్రానికి ఆమోద ముద్ర పడగా, ప్రభుత్వంపై రూ. 1241.78 కోట్ల అదనపు భారం పడనుంది.

ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా పెరిగిన వేతన బకాయిలను రాష్ట్రాలకు కేంద్రం రీఎంబర్స్‌ చేస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 18 వేలు ఉండగా, దాన్ని రూ. 26 వేలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 2.57 రెట్లుగా ఉన్న ఫిట్ మెంట్ ను 3.68 రెట్లకు పెంచాలని కూడా వారు కోరుతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో వేతన పెంపుపై కేంద్రం సానుకూల నిర్ణయమే తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 1న అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్‌ లో నిర్ణయం ఉంటుందని దాదాపు 50 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఆశతో ఉన్నారు.

More Telugu News