Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • స్లిమ్ గా తయారవుతున్న అనుష్క 
  • 'ఎఫ్ 2' దర్శకుడికి ఫుల్ డిమాండ్ 
  • నెగటివ్ పాత్రలో ప్రముఖ కమెడియన్
  • రాజశేఖర్ 'కల్కి'భారీ షెడ్యూల్

*  గతంలో కొన్ని సినిమాల కోసం బరువు పెంచిన కథానాయిక అనుష్క ఇప్పుడు తన తాజా చిత్రం 'సైలెన్స్' కోసం స్లిమ్ గా తయారవుతోందట. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరుగుతుంది.
*  సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాల్లోకి 'ఎఫ్ 2' చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ హీరోలు అతనితో చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, తన తదుపరి చిత్రాన్ని కూడా దిల్ రాజు బ్యానర్లోనే చేయడానికి అనిల్ సిద్ధమవుతున్నాడట.
*  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందే చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ హాస్య నటుడు పృథ్వీ ఇందులో ఓ నెగటివ్ క్యారెక్టర్ ను పోషించనున్నాడని తెలుస్తోంది.
*  'గరుడవేగ' చిత్రం తర్వాత డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు 'కల్కి' చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజా భారీ షెడ్యూల్ షూటింగ్ ఈ వారాంతంలో మొదలవుతుంది.

More Telugu News