Andhra Pradesh: శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖను ఇవ్వకపోతే హైకోర్టులో పిటిషన్ వేస్తా!: జైలు అధికారికి లాయర్ సలీం హెచ్చరిక

  • హైదరాబాద్ లోనే మిగిలిన విచారణ సాగుతుంది
  • శ్రీనివాసరావు ఆరోగ్యం బాగుంది
  • మీడియాతో మాట్లాడిన నిందితుడి లాయర్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై దాడికేసులో ఎన్ఐఏ అధికారులు నిందితుడు శ్రీనివాసరావును నాలుగోరోజు విచారిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఎన్ఐఏ కార్యాలయంలో లాయర్ అబ్దుల్ సలీం సమక్షంలో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీనివాసరావు ఆరోగ్యం ప్రస్తుతం బాగుందని తెలిపారు. తన క్లయింట్ ను ఎన్ఐఏ అధికారులు విశాఖపట్నం తీసుకెళ్లడం లేదని స్పష్టం చేశారు.

మిగిలిన మూడు రోజులు కూడా హైదరాబాద్ లోని ఎన్ఐఏ ఆఫీసులోనే విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. జైలులో ఉండగా శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖను ఓ జైలు అధికారి బలవంతంగా లాక్కున్నాడని సలీం ఆరోపించారు. ఆ లేఖను తిరిగి ఇవ్వాలని కోరినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే చేస్తే అధికారులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని హెచ్చరించారు.

More Telugu News