george reddy: తెరకెక్కుతున్న జార్జిరెడ్డి బయోపిక్!

  • టాలీవుడ్ లో కొనసాగుతున్న బయోపిక్ ల హవా
  • ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న సావిత్రి, ఎన్టీఆర్ ల బయోపిక్
  • తెరకెక్కుతున్న విద్యార్థి ఉద్యమ నేత జార్జిరెడ్డి జీవిత చరిత్ర

టాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తోంది. ఇప్పటికే దివంగత సావిత్రి, ఎన్టీఆర్ ల బయోపిక్ లు విడుదలై ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి. త్వరలోనే వైయస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ విడుదల కానుంది. తాజాగా మరో బయోపిక్ తెరకెక్కుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పేరొందిన జార్జిరెడ్డి బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో జార్జి రెడ్డి పాత్రను 'వంగవీటి ఫేమ్' శాండీ పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కానుంది. నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్శిటీల్లో చదువుకున్న జార్జిరెడ్డి 25 ఏళ్ల వయసులోనే దుండగుల దాడిలో మరణించాడు.

More Telugu News