Tollywood: ‘ఇండియన్-2’ ఫస్ట్ లుక్ విడుదల.. సేనాపతి లుక్ లో కమలహాసన్ అదుర్స్!

  • మర్మకళను ప్రదర్శిస్తున్నట్లు పోస్టర్
  • ఈ నెల 18 నుంచి షూటింగ్ ప్రారంభం
  • రెహమాన్ స్థానంలో అనిరుధ్ సంగీతం

విలక్షణ నటుడు కమలహాసన్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్, దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో భారీ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మరోసారి అదే రికార్డును రిపీట్ చేసేందుకు దర్శకుడు శంకర్ సిద్ధమయ్యారు. తాజాగా ‘ఇండియన్-2’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను శంకర్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా అభిమానులకు పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి సేనాపతి పాత్రలో కమల్ మర్మకళ ను ప్రదర్శిస్తున్నట్లు ఉన్న పోస్టర్ ను శంకర్ విడుదల చేశారు. ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ  నిర్మిస్తున్న ఈ సినిమాలో కమల్‌‌ సరసన కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 18 నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు దర్శక, నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

More Telugu News