allu aravind: గతంలో ఘన విజయాన్ని అందుకున్న 'గజిని' .. సీక్వెల్ దిశగా అడుగులు

  • హిందీలో రీమేక్ అయిన 'గజిని'
  • అక్కడ కూడా రికార్డుస్థాయి వసూళ్లు
  •  'గజిని 2' టైటిల్ రిజిస్టర్ చేయించిన అల్లు అరవింద్  

మురుగదాస్ తమిళంలో తెరకెక్కించిన 'గజిని' అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. అంతేకాదు, తెలుగులోను ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమాను అల్లు అరవింద్ .. హిందీలో రీమేక్ చేశారు. ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా మురుగ దాస్ దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే దిశగా అడుగులు పడుతున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. రీసెంట్ గా అల్లు అరవింద్ .. గీతాఆర్ట్స్ బ్యానర్ పై 'గజిని 2' టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. దాంతో ఈ బ్యానర్ పై 'గజిని 2' రూపొందనుందనేది ఖాయమైపోయింది. హిందీలో ఈ సినిమాను మురుగదాస్ తోనే చేస్తారా? ఆమిర్ ఖాన్ తోనే నిర్మిస్తారా? కొత్త కథతో మొదలవుతుందా .. లేదంటే పాత కథకి కొనసాగింపుగా ఉంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్ దొరకనుంది.   

More Telugu News