chaitu: 'మజిలీ' రిలీజ్ డేట్ ఖరారు

  • శివ నిర్వాణ నుంచి 'మజిలీ'
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్
  •  ఏప్రిల్ 5వ తేదీన విడుదల  

నాగచైతన్య కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ 'మజిలీ' సినిమాను రూపొందిస్తున్నాడు. సమంత కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారానే తెలియజేశారు. సాహు గారపాటి .. హరీశ్ పెద్ది నిర్మిస్తోన్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. కథాకథనాలు .. సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయని అంటున్నారు. కొంతకాలంగా చైతూకి చెప్పుకోదగిన హిట్ లేదు. ఇటీవల వరుసగా వచ్చిన ఆయన సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఈ సినిమా అయినా ఆయనకి హిట్ తెచ్చిపెడుతుండేదేమో చూడాలి.

More Telugu News