nandita sweta: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'అక్షర' మోషన్ పోస్టర్

  • చిన్నికృష్ణ నుంచి 'అక్షర'
  • లెక్చరర్ పాత్రలో నందిత శ్వేత
  • కాలేజ్ నేపథ్యంలో సాగే కథ

మొదటి నుంచి కూడా నందిత శ్వేత విభిన్నమైన పాత్రలను చేస్తూ వస్తోంది. ఆమె తాజా చిత్రంగా 'అక్షర' రూపొందుతోంది. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, నాయిక ప్రాధాన్యత కలిగిన కథగా కొనసాగుతుంది. కథ అంతా కూడా నందిత శ్వేత చుట్టూ తిరుగుతుంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

సురేశ్ వర్మ .. అహితేజ నిర్మిస్తోన్న ఈ సినిమాలో నందిత శ్వేత లెక్చరర్ పాత్రలో కనిపించనుంది. కాలేజ్ నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా రూపొందుతోందనే విషయం అర్థమవుతోంది. మోషన్ పోస్టర్ ను బట్టి చూస్తే, ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోనే ఈ సినిమా నిర్మితమవుతోందని తెలుస్తోంది. చూస్తుంటే ఈ సినిమా తరువాత నందిత శ్వేత  మరింత బిజీ అయ్యేలానే కనిపిస్తోంది.                                                           

More Telugu News