kgf: పాకిస్థాన్ లో విడుదలైన 'కేజీఎఫ్' హిందీ వర్షన్

  • ఇప్పటికే రూ. 200 కోట్లను కొల్లగొట్టిన 'కేజీఎఫ్'
  • దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న యష్
  • ఇస్లామాబాద్, లాహోర్ లలోని మల్టీప్లెక్స్ లలో విడుదల

స్టార్ హీరో యష్ నటించిన కన్నడ చిత్రం 'కేజీఎఫ్' బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 2400 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హిందీ డబ్బింగ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లను సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ద్వారా యష్ దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఈ చిత్రం మరో సంచలన రికార్డును సొంతం చేసుకుంది. పాకిస్థాన్ లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం హిందీ వర్షన్ ను ఇస్లామాబాద్, లాహోర్ లలోని మల్టిప్లెక్స్ లలో విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా ప్రేక్షకాదరణను మూటగట్టుకుంది.

More Telugu News