venkatesh: 'ఎఫ్ 2' దూకుడు మాములుగా లేదు

  • సంక్రాంతి బరిలోకి చివరిగా దిగిన 'ఎఫ్ 2'
  • తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోను అదే జోరు
  • ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు 13 కోట్లు

వరుస విజయాలతో దూసుకుపోతోన్న అనిల్ రావిపూడి ఖాతాలోకి 'ఎఫ్ 2'తో మరో హిట్ చేరిపోయింది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. తమన్నా .. మెహ్రీన్ ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చేసుకుంది. హాస్యరస ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 7.2 కోట్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 13 కోట్ల వసూళ్లను రాబట్టింది.

అమెరికా వసూళ్ల విషయానికి వస్తే, రెండు రోజుల్లో ఈ సినిమా దాదాపు 5 కోట్లను రాబట్టింది. కుటుంబ సమేతంగా చూస్తూ హాయిగా నవ్వుకునే కంటెంట్ కావడం వల్లనే అక్కడ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు దక్కినట్టు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పండుగ సెలవులు నడుస్తుండటంతో, ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ 'కథానాయకుడు' .. చరణ్ 'వినయ విధేయ రామ' థియేటర్స్ లో ఉండగా, ఈ సినిమా ఈ స్థాయి దూకుడు చూపిస్తుండటం విశేషమే.

More Telugu News